- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం వీణవంక పోలీస్ స్టేషన్ లో హుజురాబాద్ ఏసిపి మాధవి ఆధ్వర్యంలో

దిశ, వీణవంక: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం వీణవంక పోలీస్ స్టేషన్ లో హుజురాబాద్ ఏసిపి మాధవి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరును, స్టేషన్లో నిర్వహించే విధులు, పౌరులు పొందాల్సిన సేవలు, డయల్ 100, షీ టీం, సైబర్ క్రైమ్,ఆయుధాల పనితీరు, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు.
24 గంటలు ప్రజలకు అందుబాటులో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందని నేరస్తులను ఫింగర్ ప్రింట్ విధానం ద్వారా గుర్తుపట్టే టెక్నాలజీ,ఫ్రెండ్లీ పోలీసింగ్ పై అవగాహన కల్పించారు. చదువు ఒక్కటే విద్యార్థుల జీవితాలను మారుస్తుందని విద్యార్థిని,విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సిఐ, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి పాల్గొన్నారు.






