- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క స్ట్రాంగ్ రూం మాత్రమే తెరిచాం: కలెక్టర్ యాస్మిన్ భాషా
by Kema Shiva Kumar |
కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూం తాళాలు దొరకకపోవడంతో అధికారుల ప్రయత్నం ఫలించ లేదు.

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూం తాళాలు దొరకకపోవడంతో అధికారుల ప్రయత్నం ఫలించ లేదు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నూకపెల్లి శివారులోని వీ.ఆర్.కే ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూం తేరేచెందుకు ఉదయం 10 గంటలకు వచ్చిన అధికారులకు తాళాలు దొరక లేదు. అధికారుల వద్ద ఉన్న తాళాలతో ప్రయత్నం చేయగా మొత్తం మూడు రూములుకు గాను కేవలం ఒక రూం మాత్రమే తెరచుకున్నట్లు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా తెలిపారు. దీంతో ఆ రూంలో ఉన్న ఈవీఎంలు ఇతర సామాగ్రి భద్రంగా ఉన్నట్ల కలెక్టర్ తెలిపారు. అయితే, ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని కోర్టు నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు.
Next Story






