- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నారాయణరావుపల్లిలో సర్పంచ్ కు ఒకే ఒక్క నామినేషన్..!
దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలంలోని 27 గ్రామాలలో నారాయణ రావు పల్లి గ్రామంలో ఒకే ఒక నామినేషన్ వచ్చిందని, స్క్రూట్నీ అయిన తర్వాత బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలంలోని 27 గ్రామాలలో నారాయణ రావు పల్లి గ్రామంలో ఒకే ఒక నామినేషన్ వచ్చిందని, స్క్రూట్నీ అయిన తర్వాత బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 118, వార్డు సభ్యులు 556 మంది బరిలో ఉన్నట్టు ఎంపీడీవో దివ్యదర్శనరావు తెలిపారు. మండల పరిధిలోని గ్రామపంచాయతీ ఎన్నికల కొరకు వేసిన నామినేషన్ ల స్క్రూట్నీ పూర్తి అయిన తర్వాత సర్పంచ్ అభ్యర్థులు 118 మంది, వార్డు సభ్యులు 566 మంది నామినేషన్ లు చెల్లుబాటు అయినట్లు తెలిపారు. వార్డు సభ్యుల నామినేషన్లలో గర్రెపల్లి గ్రామంలో ఒకటి, మంచిరామి గ్రామంలో రెండు నామినేషన్లు తిరస్కరించబడ్డాయని.. 27 సర్పంచ్ పదవులకు నారాయణరావు పల్లి గ్రామంలో ఒకే నామినేషన్ వచ్చిందని తెలిపారు. 246 వార్డులకు కాను 245 వార్డులలోనే నామినేషన్లు దాఖలు అయినట్లు, 245 వార్డులకు గాను 39 వార్డులలో సింగిల్ నామినేషన్ వచ్చిందని ఎంపీడీవో దివ్యదర్శనరావు స్పష్టం చేశారు. నారాయణరావుపల్లి సర్పంచ్ గా రాజిరెడ్డిని అధికారికంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సి ఉంది.






