- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్ కాంగ్రెస్ లో మరోసారి భగ్గుమన్న విభేదాలు
కరీంనగర్ కాంగ్రెస్ లో మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందే నాయకులు బాహాబాహీకి దిగారు.

X
దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ కాంగ్రెస్ లో మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందే నాయకులు బాహాబాహీకి దిగారు. మాజీ కార్పొరేటర్లకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో డీసీసీ అధ్యక్షుడి ముందు కార్పొరేటర్లు, నాయకులు గొడవకు దిగిన విషయం తెలిసిందే. నాయకుల గొడవకు దిగివచ్చిన డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యకర్తలకి సముదాయించడంతో ఆ గొడవ సద్దుమణిగింది. తాజాగా మరోసారి కూడా నేతల మధ్య విభేదాలు రావడంతో కాంగ్రెస్ నేతల్లో చర్చలు మొదలయ్యాయి.
Next Story






