మరోసారి చిరుత కలకలం.. ఎక్కడంటే..?

by Naveena |

వేములవాడ పరిసర ప్రాంతాల్లో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది.

మరోసారి చిరుత కలకలం.. ఎక్కడంటే..?
X

దిశ, వేములవాడ టౌన్: వేములవాడ పరిసర ప్రాంతాల్లో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్ నగర్ గ్రామ అటవీ శివారులో చిరుత సంచారిస్తునట్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఓ పాడి గేదెపై చిరుత దాడి చేసి చంపినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే గేదెపై దాడి చేసింది నిజంగా చిరుతేనా.. లేదంటే మరేదైనా అనేది నిర్థారణ కావాల్సి ఉంది. దాడి విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చాలా రోజుల తర్వాత

వాస్తవానికి గత నెల రోజుల క్రితమే కొడిమ్యాల అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే పెద్ద పులి దొరకకపోవడంతో.. ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటుందని భావించారు. కానీ మళ్ళీ ఒకసారి ఫాజుల్ నగర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు ప్రచారం జరుగుతుండడంతో.. మళ్ళీ అలర్ట్ అయ్యారు. ఈ పరిణామంతో అటవీ పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులలో మరోసారి ఆందోళన మొదలైంది.

Next Story