కన్న కొడుకు అంటూ వచ్చాడు....ఆస్తులన్నీ అమ్మేశాడు

by velandi.Saikiran |

వృద్ధాప్యంలో అక్కున చేర్చుకుంటాడు అనుకుంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాడని జగిత్యాల ఆర్ఎన్టీ నగర్ కు చెందిన తుదగేని

కన్న కొడుకు అంటూ వచ్చాడు....ఆస్తులన్నీ అమ్మేశాడు
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: వృద్ధాప్యంలో అక్కున చేర్చుకుంటాడు అనుకుంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాడని జగిత్యాల ఆర్ఎన్టీ నగర్ కు చెందిన తుదగేని రాధమ్మ అనే వృద్ధురాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తన భర్త భీమయ్య మరణానంతరం రాములు అనే వ్యక్తి తాను భీమయ్యకు పుట్టిన కొడుకునే అంటూ కుటుంబంలోకి ప్రవేశించినట్లు తెలిపింది రాధమ్మ.

కుటుంబానికి అండగా ఉంటాడని పెంచి పోషిస్తే అక్రమంగా తన ఆస్తులన్నీ అమ్మడమే కాకుండా ఉన్న ఇంటిని కూడా కూల్చేసి బయటకు గెంటేసాడని ఫిర్యాదులో పేర్కొంది. తన కొడుకు వేణుగోపాల్ మరణించడంతో పాటు నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు అవడంతో ఒంటరిగా మిగిలిపోయినట్లు వాపోయింది. ఈ తరుణంలోనే తనకు న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా అధికారులను వేడుకుంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.

Next Story