- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనం కేసులో పాత నేరస్తుడు అరెస్ట్
దొంగతన కేసులో పాత నేరస్తుడు అరెస్ట్ అయిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, ఓదెల : దొంగతన కేసులో పాత నేరస్తుడు అరెస్ట్ అయిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఓదెల మండలంలోని కొత్తపల్లి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ గుంటి శ్రావణ్ పట్టుకున్నారు. శానగుండ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానస్పదంగా ఒక వ్యక్తి మోటర్ సైకిల్ పై రాగా అతనిని ఆపి వాహన పేపర్ లు అడగ్గా.. ఆ వ్యక్తి సరైన సమాధానం చెప్పకపోవడం తో అనుమానం వచ్చి వెంటనే అతని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు గుంటి శ్రావణ్ అని తెలిపగా వెంటనే పోలీస్ స్టేషన్ తరలించి విచారించగా గతంలో చేసిన దొంగతనాల నేరాలను ఒప్పుకున్నారు. నిందితుడు నుండి 5 గ్రామ్స్ గోల్డ్ (2గోల్డ్ నుప్టియల్స్ , 1 నోస్ రింగ్ 4 తులాల సిల్వర్ Toe రింగ్స్ , 10 తులాల సిల్వర్ raw ముక్క మూడు మోటార్ సైకిల్స్ రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ...రాబోయేది వేసవికాలం కాబట్టి సెలవుల నిమిత్తం ఊర్లకు వెళ్లే వారు తమ విలువైన బంగారు ఆభరణాలను తమతో తీసుకువెళ్లడం లేదా బ్యాంక్ లాకర్లలో భద్రపరచడం చేయాలి. ఊర్లోకి వెళ్లే ముందు పోలీస్ స్టేషన్‌నకు సమాచారం ఇవ్వాలని సూచించారు.






