ఓజీ క్యాజీ..

by Elthuri vijay kumar |

సినిమా హీరోపై అభిమానంతో ఫ్లెక్సీలు కట్టడం, రక్తదానాలు చేయడం, అన్నదానాలు చేయడం, రోగులకు పండ్లు పంపిణీ చేయడం లాంటి సేవా కార్యక్రమాలు తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఓ స్టార్ హీరోపై అభిమానంతో ఓ అభిమాని పాదయాత్ర ప్రారంభించాడు.

ఓజీ క్యాజీ..
X

ఓజీ క్యాజీ..

పవన్ కళ్యాణ్ అభిమాని పాదయాత్ర

హైదరాబాద్ టు కొండగట్టు

OG సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని అంజన్నకు మొక్కు

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : సినిమా హీరోపై అభిమానంతో ఫ్లెక్సీలు కట్టడం, రక్తదానాలు చేయడం, అన్నదానాలు చేయడం, రోగులకు పండ్లు పంపిణీ చేయడం లాంటి సేవా కార్యక్రమాలు తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఓ స్టార్ హీరోపై అభిమానంతో ఓ అభిమాని పాదయాత్ర ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అభిమానంతో తాళం నవీన్ అనే వ్యక్తి హైదరాబాదు నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఓజి (OG) సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఈనెల 23న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకొని పాదయాత్ర ప్రారంభించాడు. కొండగట్టు అంజన్న ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి, దర్శన అనంతరం పవన్ కళ్యాణ్ ను కలుస్తానని అభిమాని నవీన్ చెబుతున్నాడు.

Next Story