- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంపుడు కుక్కకు ‘నిలువెత్తు బంగారం’
జంతువుల పట్ల మానవత్వాన్ని చాటుకుంటూ శ్రీమాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజు వినూత్న రీతిలో మొక్కు తీర్చుకున్నారు.

దిశ,పెద్దపల్లి : జంతువుల పట్ల మానవత్వాన్ని చాటుకుంటూ శ్రీమాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజు వినూత్న రీతిలో మొక్కు తీర్చుకున్నారు. తన పెంపుడు కుక్క భైరవ అనారోగ్యం నుంచి కోలుకోవాలంటూ సమ్మక్క- సారక్క వన దేవతలకు ఆయన మొక్కుకున్నారు. మొక్కు ప్రకారం.. భైరవ పూర్తిగా ఆరోగ్యవంతుడైతే జాతర సందర్భంగా దాని బరువుకు సమానమైన ‘నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు. గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురైన భైరవ ఆహారం తీసుకోలేక అస్వస్థతకు లోనైంది. ఈ నేపథ్యంలో కాసర్ల రాజు వన దేవతలను ప్రార్థించారు. మొక్కుకున్న కొద్ది రోజులకే భైరవ ఆరోగ్యం మెరుగుపడటంతో, ఆదివారం పెద్దపల్లి పట్టణంలో ఆయన తన మొక్కును నెరవేర్చుకున్నారు. కుక్కను నిలువెత్తు తూచి, దాని బరువుకు సమానమైన బెల్లాన్ని దేవతలకు సమర్పించి కృతజ్ఞతలు తెలిపారు. మూగజీవి పట్ల ఆయన చూపిన ప్రేమ, బాధ్యతాయుతమైన ప్రవర్తనను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీమాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఏంఓ కోట మల్లేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు బొడ్డు సుమన్, బొడ్డుపల్లి రవి, బండ రాజయ్య, కొమరిశెట్టి శ్రీనివాస్, ఓరుగంటి శ్రీధర్, సురేష్, రమేష్ పాల్గొన్నారు.






