నియోజకవర్గ సమగ్రాభివృద్దే లక్ష్యం : ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

by Ratna Kumari |

రామగుండం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు.

నియోజకవర్గ సమగ్రాభివృద్దే లక్ష్యం : ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ : రామగుండం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. మంగళవారం కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు), కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అభివృద్ధి సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 99రోజుల కార్యాచరణ ప్రణాళిక "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" చేపట్టినట్టు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ ఫలాలు అర్హులకు చేరుతాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మౌలిక వసతుల కల్పన సౌకర్యాల ఏర్పాటుకు వెనకాడే ప్రసక్తి లేదన్నారు.

ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అందరి సమన్వయం సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికా వద్దంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేయడం, సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడుతున్నామని, అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి ముందుకు సాగాలన్నారు.


ప్రజలు వీధి దీపాలు, డ్రైనేజీ, తాగునీటి, రోడ్లు సమస్యల గురించి ఎమ్మెల్యేకు వివరించగా..త్వరతిగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ లోని ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు, చెత్త చెదరాన్ని ట్రాక్టర్, జేసీబీ సహాయంతో తొలగించారు. డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెళ్లి ఎల్లయ్య, 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, కార్పొరేషన్ లోని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు అనుము స్వరూప రాములు, ముస్తఫా, దూళికట్ట సతీష్, నాయకులు బండ రమేష్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, నాచగోని దశరథం గౌడ్, మార్కరాజు, మోత్కూరి శంకర్, మోతుకు అవినాష్, మారం కుమార్, పూజారి రాకేష్, సోషల్ మీడియా ఇంచార్జీ మేకల అజయ్, బొల్లం రాజు, దేవయ్య, సాదుల రాజేష్, మోను, సాదుల అరుణ్ తో పాటు మున్సిపల్ సిబ్బంది, సూపర్వైజర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

Next Story