అటవీ సరిహద్దుల్లో మట్టి తవ్వకాలు చేయొద్దని జేసీబీ యజమానులకు నోటీసులు జారీ

by Kodari Anjali |

కొల్లాపూర్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య జేసీబీ వాహనాల యజమానులకు నోటీసులు అందజేశారు.

అటవీ సరిహద్దుల్లో మట్టి తవ్వకాలు చేయొద్దని జేసీబీ యజమానులకు నోటీసులు జారీ
X

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంత సరిహద్దుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరపరాదని సంబంధిత జేసీబీ యజమానులు, నిర్వాహకులకు అటవీ శాఖ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. అటవీ భూములు, అటవీ సరిహద్దులను పరిరక్షించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అడవి సరిహద్దుల వద్ద ఎలాంటి మట్టి తవ్వకాలు, భూమి చదును పనులు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు చేపట్టరాదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధిత జేసీబీ యజమానులను హెచ్చరిస్తూ, భవిష్యత్తులో అటవీ ప్రాంతాలకు నష్టం కలిగించే విధంగా ఎలాంటి పనులు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అటవీ సంపద, వన్యప్రాణులు పర్యావరణ పరిరక్షణలో ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ బయన్న, బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story