నూకపెల్లి డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల ఆందోళన

by Nallavelli.Anjaneyulu |

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై నూకపెల్లి డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులు గురువారం ఆందోళన చేప‌ట్టారు. తమ ఇళ్లకు సరైన నీటి సరఫరా, డ్రైనేజ్ సౌకర్యం

నూకపెల్లి డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల ఆందోళన
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై నూకపెల్లి డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులు గురువారం ఆందోళన చేప‌ట్టారు. తమ ఇళ్లకు సరైన నీటి సరఫరా, డ్రైనేజ్ సౌకర్యం లేదని సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ఫలితం లేదని వాపోయారు. కాంగ్రెస్ సర్కారు, జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో డబుల్ ఇళ్ల కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆందోళన కారణంగా కొద్ది సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Next Story