నో ట్యాక్స్.. నో సర్టిఫికెట్స్

by Elthuri vijay kumar |

నో ట్యాక్స్ నో సర్టిఫికెట్స్... గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎలాంటి పన్ను బకాయిలు ఉన్న మీకు కావాల్సిన ఎలాంటి సర్టిఫికెట్లు అయినా జారీ చేయబడవు.. ఇట్లు మీ గ్రామ కార్యదర్శి అంటూ నర్సింగాపూర్ పంచాయతీ కార్యాలయం బయట సెక్రటరీ నోటీస్ అంటించారు.

నో ట్యాక్స్.. నో సర్టిఫికెట్స్
X

నో ట్యాక్స్.. నో సర్టిఫికెట్స్

పన్ను క్లియర్ చేస్తేనే సర్టిఫికెట్లు.

నర్సింగాపూర్ గ్రామపంచాయతీకి నోటిస్ అంటించిన కార్యదర్శి

దిశ, జగిత్యాల రూరల్ : నో ట్యాక్స్ నో సర్టిఫికెట్స్... గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎలాంటి పన్ను బకాయిలు ఉన్న మీకు కావాల్సిన ఎలాంటి సర్టిఫికెట్లు అయినా జారీ చేయబడవు.. ఇట్లు మీ గ్రామ కార్యదర్శి అంటూ నర్సింగాపూర్ పంచాయతీ కార్యాలయం బయట సెక్రటరీ నోటీస్ అంటించారు. జిపి కార్యాలయంలో నిధుల లేమి కారణంగా విలేజ్ అవసరాల కొరకై పెండింగ్ ట్యాక్స్ కలెక్షన్ కొరకై ఈ నోటీస్ అంటించినట్లుగా తెలుస్తుంది. దీంతో కొందరు గ్రామస్తులు బుధవారం పంచాయతీ కార్యాలయానికి రాగా టాక్స్ కడితేనే పాడైన మోటర్ రిపేర్ అవుతుంది, మీకు కావలసిన సర్టిఫికెట్లు జారీ అవుతాయి.. గ్రామ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న టాక్స్ ను కట్టి గ్రామస్తులు సహకరించాల్సిందిగా కార్యదర్శి కోరారు. ఇదిలా ఉండగా నెల రోజులకు పైగా గ్రామంలో మంచి నీళ్లు రావడం లేదని ముందు నీటి సమస్య తీర్చిన తర్వాత ట్యాక్స్ అడగాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story