- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఆఫర్లు వచ్చినా లొంగలేదు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకు ఆఫర్లు వచ్చినా లొంగకుండా కమిట్మెంట్ తో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకు ఆఫర్లు వచ్చినా లొంగకుండా కమిట్మెంట్ తో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సంగనభట్ల దినేష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవమానాలను తట్టుకుంటూ నమ్మిన కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం జెండా పట్టుకొని పని చేశాను కాబట్టే తనకు ఈరోజు క్యాబినెట్ లో పని చేసే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో రేవంత్ పోవాలి.. మార్పు రావాలి అని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకున్నారని పేదలకు సన్న బియ్యం ఇచ్చినందుకా, రేషన్ కార్డులు మంజూరు చేసినందుకా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకా లేక ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకా ఎందుకు రేవంత్ పాలన పోవాలో జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు. నూతనంగా గ్రంథా లయ చైర్మన్ గా నియామకమైన సంఘనభట్ల దినేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎన్నికైన సంగనభట్ల దినేష్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి తదితరులు పాల్గొన్నారు.






