భవిషత్ తరాల కోసమే కొత్త విద్యుత్ ప్రాజెక్టులు : మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, జగిత్యాల ప్రతినిధి : రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మొత్తం విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడి ఉందని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరాభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో

భవిషత్ తరాల కోసమే కొత్త విద్యుత్ ప్రాజెక్టులు : మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మొత్తం విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడి ఉందని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరాభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.వ్యవసాయ ఆధారిత తెలంగాణలో ఉచిత విద్యుత్ అమలు కారణంగా విద్యుత్ అవసరం మరింత పెరుగుతున్నందున, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచి ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సౌరశక్తి, నీటి వనరుల ద్వారా సాధ్యమే అయినప్పటికీ, గ్యారంటీ పవర్ అందించగల ప్రాజెక్టులు థర్మల్ ప్లాంట్లు మాత్రమే అన్నారు. అందుకే రామగుండం, పాల్వంచ, మక్స్టాల్ ప్రాంతాల్లో మెగా పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు లభించే ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు చేయడం సమంజసమని రామగుండం ప్రాజెక్టులో నిర్మాణ వ్యయం, విద్యుత్ ఉత్పత్తి ఖర్చు యాదాద్రి కంటే తక్కువ అని ఆయన చెప్పారు. విద్యుత్ ప్రాజెక్టులపై ప్రతిపక్షాల విమర్శలు ప్రజలకు నష్టం చేస్తాయని, భవిష్యత్ తరాల కోసం తీసుకుంటున్న చర్యలను అడ్డుకోవడం సరైనది కాదని అన్నారు. మరోవైపు జీపీ ఎన్నికల నేపథ్యంలో చీరల పంపిణీపై ఎన్నికల సంఘం ఆంక్షలు సరైనవి కాదని, నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Next Story