- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరిసిల్లలో నేతన్న పొదుపు డబ్బుల పంపిణీ
పదేండ్లు చేనేత, జౌళి శాఖకు మంత్రిగా ఉండి నేత కార్మికుల బిల్లులు పెండింగ్ పెట్టిన ఘనుడు కేటీఆర్ అని తుమ్మల నాగేశ్వరరావు

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: పదేండ్లు చేనేత, జౌళి శాఖకు మంత్రిగా ఉండి నేత కార్మికుల బిల్లులు పెండింగ్ పెట్టిన ఘనుడు కేటీఆర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నేతన్న పొదుపు (త్రిప్ట్) డబ్బులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా డబ్బులు విడుదల చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లా ఇంచార్జీ కేకే మహేందర్ కలిసి పాల్గొని, త్రిప్ట్ పథకం కింద 4,963 మంది నేత కార్మికులకు రూ. 68.14 కోట్లు, 12 మంది నేత కార్మికుల కుటుంబాలకు నేతన్న బీమా పథకం కింద రూ.60 లక్షల మంజూరు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేసిన విధంగా అతి త్వరలో నేతన్నలకు ప్రభుత్వం రుణమాఫీ చేయబోతోందన్నారు. రుణమాఫీకి దాదాపు 33 కోట్ల అవసరమని చెప్పారు. రూ.480 విలువ గల నాణ్యమైన చీరలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది మహిళా సంఘ సమైక్య సభ్యులకు ఏడాదికి రెండు చొప్పున కోటి ముప్పై లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నామన్నారు. అంతేకాకుండా జీవో నెంబర్ ఒకటి ద్వారా 600కోట్ల ప్రభుత్వ శాఖల ఆడర్లు సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చామని వెల్లడించారు.
మేమే రాజులమని విర్రవిగారు - మంత్రి అడ్లూరి
గత ప్రభుత్వంలోని కల్వకుంట్ల కుటుంబం మేమే రాజులం, మేమే మంత్రులం అని విర్రవిగారని, ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన కేటీఆర్... ప్రజలను నట్టేట ముంచాడని విమర్శించారు. బిఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు 370 కోట్లు బాకాయిలు పెట్టి వెళ్ళిపోయారని ఫైర్ అయ్యారు.
మాటిచ్చాం.. అమలు చేశాం-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల అభివృద్ధి ఆగదని మాట ఇచ్చామని, మాటిచ్చిన ప్రకారం అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బాకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. 270 కోట్లతో ఇందిరా మహిళా శక్తి చీరలతోపాటు స్కూల్ యూనిఫామ్, ప్రభుత్వ శాఖల ఆడర్లు కూడా ఇచ్చి నేతన్నల కు ఏడాది పొడవున ఉపాధి కల్పిస్తున్నామన్నారు.






