గర్భిణీ ప‌ట్ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యుల నిర్ల‌క్ష్యం

by Ratna Kumari |

జ‌గిత్యాల జిల్లా మెట్ ప‌ల్లి ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌హించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

గర్భిణీ ప‌ట్ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యుల నిర్ల‌క్ష్యం
X

దిశ, మెట్ పల్లి : జ‌గిత్యాల జిల్లా మెట్ ప‌ల్లి ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌హించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గ‌ర్భిణీ భ‌ర్త ఉద‌య్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జ‌గిత్యాల జిల్లా మెట్ ప‌ల్లి ప‌ట్ట‌ణం వెంక‌ట్రావ్ పేట కాల‌నీకి చెందిన కొడిగంటి భ‌వాని అనే గ‌ర్భిణీ నెల‌లు నిండ‌గానే బంధువులు మార్చి 29న మెట్ ప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అడ్మిన్ చేశారు. అదే రోజు వైద్యులు భ‌వానికి ఆప‌రేష‌న్ చేసి శిశువును బ‌య‌టికి తీశారు. అయితే కొద్ది సేప‌టికే శిశువు చేతికి వాపును గ‌మ‌నించిన బంధువులు వైద్యురాలు మాధ‌విని నిల‌దీశారు. వెంట‌నే ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌ని సూచించారు. వాపు ఉంద‌ని ఎక్స్ రే తీయ‌గా.. శిశువు చేయి విరిగింద‌ని చెప్ప‌డంతో భ‌యాందోళ‌న‌కు గురైన‌ట్టు ఉద‌య్ తెలిపారు. నార్మ‌ల్ డెలివ‌రీలో అయితే ఏదైనా నిర్ల‌క్ష్యం జ‌రిగి ఉండ‌వ‌చ్చు కానీ ఆప‌రేష‌న్ చేసి శిశువును తీశార‌ని.. ఎలా శిశువు చేయి విరుగుతుంద‌ని తండ్రి ఉద‌య్ ఆరోపించారు. ముమ్మాటికీ ఆప‌రేష‌న్ న‌ర్సుల‌తో చేయించార‌ని అనుమానం ఉంద‌ని.. దీనికి ఆసుప‌త్రి వైద్యులే కార‌ణం అని.. శిశువు త‌ల‌పై చిన్న గాయాలున్నాయ‌ని, శిశువు భ‌విష్య‌త్ ఏంటి..? అని ఆరోపించారు.

చేతి వేల్లు తాకి ఉండ‌వ‌చ్చు : డాక్ట‌ర్ మాధ‌వి

భ‌వాని ఆదివారం డెలివ‌రీ కోసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి వ‌చ్చింద‌ని.. ఆమెకు సిజెరియ‌న్ చేయాల్సి రావ‌డంతో త‌ల్లి గ‌ర్భంలో చేతులు లోప‌లికి ఉండ‌గా.. శిశువు త‌ల భాగం, ముక్కు, చెవులు క‌నిపించ‌డంతో ఒక‌చేతిని ప‌ట్టి తీసి మ‌రోచేయి లోప‌లికి అతుక్కుపోగా ఆ చేతిని క‌ష్టంగా తీశామ‌ని.. దీంతో శిశువు తీసిన అనంత‌రం చేతికి వాపు క‌నిపించిన‌ట్టు తెలిపారు. వెంట‌నే వాపును గ‌మ‌నించి అటెండ‌ర్ల‌ను పిలిచి ఆప‌రేష‌న్ చేసే స‌మ‌యంలో కండ‌రాల ఒత్తిడితో లేదా డెలివ‌రీ స‌మ‌యంలో శిశువు చేతి విరిగి ఉండ‌వ‌చ్చ‌ని వెంట‌నే చిల్ట్ర‌న్స్ హాస్పిట‌ల్ కి తీసుకెళ్లాల‌ని సూచించాన‌ని త‌ల‌కు త‌గిలిన చిన్న‌పాటి గాయాలు క‌త్తెర‌, క‌త్తివి కావని తెలిపారు. గాయాలు ఆప‌రేష‌న్ చేసే స‌మ‌యంలో సాధార‌ణంగా జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని గాయాలు ప‌ది రోజుల్లో త‌గ్గుతాయ‌ని తెలిపారు.

Next Story