జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌ పనుల్లో నిర్లక్ష్యం

by Nallavelli.Anjaneyulu |

ఫ్లైఓవర్‌ పనులు కాస్త నత్తనడకన సాగుతుండగా, తాత్కాలిక దారి వెంట ప్రయాణికుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. భారీ వాహనాలు, లారీలు ఈ దారి గుండా వెళ్లడం వల్ల విపరీతమైన

జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌ పనుల్లో నిర్లక్ష్యం
X

దిశ, మానకొండూరు : కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో 563వ జాతీయ రహదారిపై జరుగుతున్న ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రయాణికులకు పెను ప్రమాదంగా మారింది. మానకొండూరు& రాఘవపూర్‌ గ్రామాల మధ్య, మానకొండూరు చివరన ఫ్లైఓవర్‌ పనులు జరుగుతుండగా.. వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక దారిపై ఒక ఇనుప ఐరన్ రాడ్డు ప్రమాదకరంగా అడ్డంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రాడ్డు వల్ల వాహనదారులు తీవ్ర ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఐరన్ రాడ్డు దారికి అడ్డంగా ఉన్నా, కాంట్రాక్టర్లు , సంబంధిత అధికారులు దీనిని తొలగించడానికి కనీసం హెచ్చరిక బోర్డు పెట్టడానికి పట్టించుకోవడం లేదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుమ్ము, ధూళితో మరో ఉపద్రవం

ఫ్లైఓవర్‌ పనులు కాస్త నత్తనడకన సాగుతుండగా, తాత్కాలిక దారి వెంట ప్రయాణికుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. భారీ వాహనాలు, లారీలు ఈ దారి గుండా వెళ్లడం వల్ల విపరీతమైన దుమ్ము లేచి, ప్రయాణికుల కళ్ళల్లో పడి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రయాణికులు పడుతున్న కష్టాలు ఇంకెన్నాళ్లు? అని స్థానికులు, వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే, ఈ సమస్యను వెంటనే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. జాతీయ రహదారి పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న కాంట్రాక్టర్లు, అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Next Story