- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ ఎగ్జామ్ సరిగా రాయలేదని స్టూడెంట్ ఆత్మహత్య.
నీట్ పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మండలం చల్గల్ లో చోటుచేసుకుంది.

X
దిశ, జగిత్యాల టౌన్: నీట్ పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మండలం చల్గల్ లో చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చల్గల్ గ్రామానికి చెందిన జంగ పూజ 2023లో నీట్ ఎగ్జామ్ రాసింది. అయితే సరైన స్కోర్ రాకపోవడంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఆదివారం జరిగిన నీట్ పరీక్షకు హాజరైంది. పరీక్ష అనంతరం ఇంటికి వచ్చిన పూజ ఈసారి కూడా సరైన స్కోర్ రాదని పరీక్ష బాగా రాయలేదని మనస్తాపం చెంది సోమవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






