- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊటూర్ ఇసుక క్వారీలో మిస్టరీ..!
by Ratna Kumari |
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ ఇసుక రీచ్ వద్ద కలకలం రేగింది.

X
దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ ఇసుక రీచ్ వద్ద కలకలం రేగింది. ఇసుక లోడింగ్ కోసం వరుసలో వేచి ఉన్న ఓ లారీ డ్రైవర్ తన లారీ క్యాబిన్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున తోటి డ్రైవర్లు గమనించేసరికి, సదరు డ్రైవర్ తన లారీ క్యాబిన్‌లో బోర్లా పడి ప్రాణాల్లేకుండా కనిపించాడు. నిన్నటి వరకు తమతో కలిసున్న వ్యక్తి ఇలా అకస్మాత్తుగా శవమై తేలడంతో తోటి కార్మికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసుల వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పలువురికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది గుండె పోటా..? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
Next Story






