చంద్రబాబుకు మై విలేజ్ షో గంగవ్వ క్షమాపణలు

by Disha Web Desk 20 |
చంద్రబాబుకు మై విలేజ్ షో గంగవ్వ క్షమాపణలు
X

దిశ, మల్యాల : టీడీపీ అధినేత చంద్రబాబుకు క్షమాపణలు చెబుతూ మై విలేజ్ షో గంగవ్వ కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఏమీ తెలియదని ఛానల్ వాళ్ళు చెప్పమన్నది నేను చెప్పానని బాధపడ్డారు. అసలు విషయానికి వస్తే ఒక తెలుగు ఛానల్ లో ఉగాదిని పురస్కరించుకొని ఈ ఏడాది ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయగా అందులో పార్టిసిపేట్ చేసిన గంగవ్వకు సినీ, రాజకీయ నాయకుల జాతకాలు చెప్పాలంటూ స్క్రీన్ పై చంద్రబాబు లోకేష్ ఫోటోలు చూపించి యాంకర్ అడిగిన ప్రశ్నకు గంగవ్వ చంద్రబాబుకు గ్రహణం పట్టుకుంది అంటూ వ్యాఖ్యానించారు.

దీన్ని ఇతర పార్టీల వారు ట్రోల్ చేసి నెట్ ఇంట్లో వైరల్ చేశారు. దీనిని గమనించిన మై విలేజ్ షో టీం, గంగవ్వ ఒక వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. చంద్రబాబు పై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని, సినీ, రాజకీయ నాయకుల గురించి అంతగా తనకు అవగాహన లేదని, ఆ చానల్ వాళ్లు చెప్పింది నేను చేశానని అంతకుమించి నాకు ఏం తెలియదని చంద్రబాబుకు క్షమాపణలు చెబుతూ ఆ వీడియోలో గంగవ్వ కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ నాయకులు వైరల్ చేశారు.

Read more:

తెలుగుదేశం మళ్లీ వెలిగేనా?


Next Story