- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా అన్నకు మంత్రి పదవి రావాలె..! హుండీలో అజ్ఞాత భక్తుడి లెటర్
‘మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నకు మంత్రి పదవి రావాలె దేవుడా..!’

దిశ, జగిత్యాల ప్రతినిధి: ‘మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నకు మంత్రి పదవి రావాలె దేవుడా..!’ అంటూ ఓ అజ్ఞాత భక్తుడు హుండీలో లెటర్ రాసి దేవుడిని వేడుకున్నాడు. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ అజ్ఞాత భక్తుడు రాసిన లెటర్ బయటపడింది. ఎమ్మెల్యే సత్యం అన్న సైనికుడు అనే పేరుతో రాసిన ఉత్తరంలో.. ‘స్వామి నీ ఆశీర్వాదంతో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అదేవిధంగా మా సత్యం అన్నకు కూడా మంత్రి పదవి వచ్చేలా దీవించు స్వామి’ అంటూ అంజన్నను వేడుకున్నాడు. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే మా గ్రామం నుంచి కొండగట్టు వరకు కుటుంబ సమేతంగా పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని ఉత్తరంలో వెల్లడించాడు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై ఉన్న అభిమానంతో అజ్ఞాత భక్తుడు రాసిన ఉత్తరం కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.






