- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
“నా బిడ్డను అమ్మేశారు… నాకు నా బాబు కావాలి”
ప్రేమ వివాహం చేసుకున్న తనను భర్తతో విడదీయడమే కాకుండా పుట్టిన శిశువును అక్రమంగా అమ్మేశారని ఆరోపిస్తూ ఓ యువతి భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించిన ఘటన జగిత్యాలలో సంచలనంగా మారింది.

దిశ, జగిత్యాల రూరల్ : ప్రేమ వివాహం చేసుకున్న తనను భర్తతో విడదీయడమే కాకుండా పుట్టిన శిశువును అక్రమంగా అమ్మేశారని ఆరోపిస్తూ ఓ యువతి భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించిన ఘటన జగిత్యాలలో సంచలనంగా మారింది. తనకు జన్మనిచ్చిన బాబును తిరిగి అప్పగించి న్యాయం చేయాలని కోరుతూ అశ్విని అనే యువతి భర్త తో కలిసి ఈ నెల 7వ తేదీన జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన అశ్విని అనే యువతి, జగిత్యాల పట్టణానికి చెందిన సాయి కుమార్ ను 2025 ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. వివాహానంతరం ఆమె గర్భం దాల్చింది. అయితే ఫార్మాలిటీ పేరుతో ఇంటికి తీసుకెళ్లిన తన తల్లి, తనను అక్రమంగా నిర్బంధించి భర్తతో విడదీసిందని అశ్విని ఆరోపించింది. అనంతరం తనను జగిత్యాల నుంచి ముంబైకు తీసుకెళ్లి అక్కడే ప్రసవం జరిపించారని తెలిపింది. ముంబైలో మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం.. తన తల్లి, బావ కలిసి ఆ శిశువును రూ.50 వేలకు మరో వ్యక్తికి విక్రయించారని అశ్విని ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత తనను తిరిగి జగిత్యాలకు తీసుకువచ్చారని, ఇటీవల వారి నుండి తప్పించుకుని భర్తను కలుసుకున్నట్లు ఆమె తెలిపింది. తనకు పుట్టిన బాబును తనకు అప్పగించి న్యాయం చేయాలని, అలాగే బిడ్డను విక్రయించిన తన తల్లి, బావతో పాటు శిశువును అక్రమంగా కొనుగోలు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.






