విద్యార్థుల‌కు బ్లూ స్టార్ వాట‌ర్ డిస్పెన్స‌ర్ బ‌హుక‌ర‌ణ : రిటైర్డ్ ఉపాధ్యాయులు

by Nallavelli.Anjaneyulu |

సుల్తానాబాద్ లోని ZPHS (గ‌ర్ల్స్) లో సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన సోమిరెడ్డి మురళీధర్, కంకటి పద్మ ఉపాధ్యాయులు ఉదారతను చాటుకున్నారు.

విద్యార్థుల‌కు బ్లూ స్టార్ వాట‌ర్ డిస్పెన్స‌ర్ బ‌హుక‌ర‌ణ :  రిటైర్డ్ ఉపాధ్యాయులు
X

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ లోని ZPHS (గ‌ర్ల్స్) లో సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన సోమిరెడ్డి మురళీధర్, కంకటి పద్మ ఉపాధ్యాయులు ఉదారతను చాటుకున్నారు. విధి నిర్వహణలో విద్యార్థుల భవిష్యత్ కు బాటలు వేసి పదవి విరమణ పొందారు. వారు పని చేసిన పాఠశాలపై మమకారాన్ని ప్రదర్శించారు. స్కూల్ అవస‌రాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల కోసం క్రొత్త బ్లూ స్టార్ వాటర్ డిస్పెన్సర్ ను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మురళీధర్, పద్మ సేవలను కొనియాడారు. ప‌ద‌వీ విరమణ పొందిన తర్వాత విద్యార్థుల కోసం వారు చేసిన అందరికీ ఆదర్శప్రాయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోట దివాకర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story