ముత్యంపేట నిజాంషుగర్ ఫ్యాక్టరీ రిఓపెనింగ్‌కు ముందడుగు

by Ajay Maddhiboyina |

చెరుకు రైతుల కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సంసిద్ధమతోంది. గత పదేళ్లుగా నిరీక్షిస్తున్న రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలోని నిజాం చెరుకు ఫ్యాక్టరీ 1980 సంవత్సరంలో స్థాపించారు.

ముత్యంపేట నిజాంషుగర్ ఫ్యాక్టరీ రిఓపెనింగ్‌కు ముందడుగు
X

చెరుకు రైతుల కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సంసిద్ధమతోంది. గత పదేళ్లుగా నిరీక్షిస్తున్న రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలోని నిజాం చెరుకు ఫ్యాక్టరీ 1980 సంవత్సరంలో స్థాపించారు. అప్పటినుంచి నిరంతరయంగా 2015 డిసెంబర్ 22 వరకు నడిచింది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం లేఅవుట్ చేసి నష్టాలు వాటిల్లుతున్నాయనే కారణాలతో ఫ్యాక్టరీని మూసివేసింది. ఫ్యాక్టరీలో 49శాతం ప్రభుత్వానిది కాగా 51శాతం గోకరాజు గంగరాజు అనే వ్యాపారవేత్తది. 2015 నుంచి చెరుకు రైతులు ఎన్నోసార్లు నిరసనలు తెలుపుతూ పాదయాత్రలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పడితే షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఫ్యాక్టరీ పునరుద్ధరీకరణకు ప్రభుత్వం ముందడుగు వేసింది. దీం రైతులలో ఆనందం నెలకొన్నది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని వేంపేట్ గ్రామంలోని ఫంక్షన్ హాల్లో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ రైతులతో ముఖాముఖి చర్చ కార్యక్రమం కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్యర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు.

దిశ, మల్లాపూర్ : చెరుకు రైతుల కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సంసిద్ధమతోంది. గత పదేళ్లుగా నిరీక్షిస్తున్న రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలోని నిజాం చెరుకు ఫ్యాక్టరీ 1980 సంవత్సరంలో స్థాపించారు. అప్పటినుంచి నిరంతరయంగా 2015 డిసెంబర్ 22 వరకు నడిచింది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం లేఅవుట్ చేసి నష్టాలు వాటిల్లుతున్నాయనే కారణాలతో ఫ్యాక్టరీని మూసివేసింది. ఫ్యాక్టరీలో 49శాతం ప్రభుత్వానిది కాగా 51శాతం గోకరాజు గంగరాజు అనే వ్యాపారవేత్తది. 2015 నుంచి చెరుకు రైతులు ఎన్నోసార్లు నిరసనలు తెలుపుతూ పాదయాత్రలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పడితే షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఫ్యాక్టరీ పునరుద్ధరీకరణకు ప్రభుత్వం ముందడుగు వేసింది. దీం రైతులలో ఆనందం నెలకొన్నది.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి లక్ష్మణ్ కుమార్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. చెరుకు రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరీకరణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరీకరణకు 10వేల నుంచి 15వేల ఎకరాల్లో చెరుకు సాగు అవసరమవుతుందని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా షుగర్ ఫ్యాక్టరీ పై బ్యాంకులలో ఉన్న అప్పు రూ.172కోట్లు ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. రైతులకు మద్దతు ధర, సీడ్, హార్వెస్టింగ్ అంశాలలో ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు చెరుకు సాగులో ఎదురయ్యే సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తామని అన్నారు.

ఫ్యాక్టరీని పరిశీలించిన ఉన్నతాధికారులు..

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావుతో కలిసి షుగర్ ఫ్యాక్టరీ ఫిజికల్‌గా ఎలా ఉందనేది పరిశీలించారు. అనంతరం మెట్‌పల్లి మండలంలోని వేంపేట్ గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ, రైతులతో ముఖాముఖి చర్చ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్యర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ చెరుకు పంట రైతుల లాభసాటిగా ఉంటుందని, ఫ్యాక్టరీ విజయవంతంగా ప్రారంభించుకుంటామని అన్నారు. అంతలో బీజేపీ నాయకులు స్టేజీ పైకి వినతి పత్రం అందజేసేందుకు రాగా కొంత గందరగోళం నెలకొన్నది. కాంగ్రెస్ నాయకులు అరవింద్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో ఆ గందరగోళం సద్దుమణిగింది. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ పై బ్యాంక్ లో ఉన్న అప్పు రూ.172కోట్లను ప్రభుత్వం చెల్లించిందని, 20వేల ఎకరాల్లో చెరుకు పంటను రైతులు సాగు చేస్తారని అన్నారు. గ్రామాలలో కోతుల బెడదతో రైతులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, చెరుకు పంటకు ఆ ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు.

రైతులకు సబ్సిడీ కల్పించాలి : కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

చెరుకు సాగులో రైతులకు సబ్సిడీ కల్పించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్యాక్టరీని రైతులే సహకార సంఘాలుగా ఏర్పడి నడిపించాలని కోరారని, అందుకు రైతులు ముందుకు రాలేదని గుర్తుచేశారు. ఫ్యాక్టరీ ప్రారంభానికి మా సంపూర్ణ మద్దతూ ఉంటుందని, చెరుకు రైతుల సమస్యలను ప్రభుత్వం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతుల హార్వెస్టింగ్, సీడ్ సమస్యలను పరిగణలోకి తీసుకోని రైతులకు భరోసా కల్పించాలని అన్నారు.

గతంలో ఫ్యాక్టరీ కోసం పాదయాత్ర : కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు

గత ప్రభుత్వంలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని ప్రతి నెలా ఒక్కో గ్రామం నుంచి పాదయాత్ర నిర్వహించామని కాంగ్రెస్ కోరుట్ల ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీ ప్రకారంగానే పునరుద్ధరీకరణకు ప్రభుత్వం వచ్చిన వెంటనే కమిటీని వేసి బ్యాంకులలో బకాయి కూడా చెల్లించారని అన్నారు. రైతుల 10 ఏళ్ల కల నెరవేరుతుందని అన్నారు.

ఫ్యాక్టరీ కోసం 15వేల ఎకరాల్లో చెరుకు సాగు అవసరం..

వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు

ఫ్యాక్టరీ కోసం 10వేల నుంచి 15వేల ఎకరాల్లో చెరుకు సాగు అవసరమని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో 76నుంచి 80శాతం వరకు వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. పంట మార్పిడి తప్పనిసరిగా రైతులు పాటించాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని అన్నారు. చెరుకు కోసం డ్రిప్పు సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని, దీంతో తక్కువ నీటితోనే పంట సాగు చేయవచ్చని అన్నారు.

Next Story