- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నతల్లి కర్కషం.. కొడుకును కొట్టి చంపిన ఘటన
రోజురోజుకు మానవత్వం మంటగలిసి పోతుంది. ఓ కన్నతల్లి కర్కషత్వం యావత్ సమాజాన్ని కంటతడి పెట్టించింది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రోజురోజుకు మానవత్వం మంటగలిసి పోతుంది. ఓ కన్నతల్లి కర్కషత్వం యావత్ సమాజాన్ని కంటతడి పెట్టించింది. అక్రమ సంబందానికి అడ్డువస్తున్నాడని కన్న కొడుకుపై ప్రియుడితో కలిసి దాడి చేయగా ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొల్పింది. మృతుడు నానమ్మ మంగళారపు అనసూయ తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ కు చెందిన మాధవి తన కొడుకు మంగళారపు అరుణ్ ని ప్రేమవివాహం చేసుకుంది. వీరికి కొడుకు ఆరుష్(6) తో పాటు ఒక కూతురు(8) ఉన్నారు. అరుణ్ గత మూడేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా మాధవి సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో వేరుగా నివాసం ఉంటుంది. అరుణ్ మరణించిన అనంతరం పిల్లలు ఇద్దరినీ అరుణ్ తల్లిదండ్రుల వద్ద ఉండగా, కొద్ది రోజుల క్రితం మాధవి తన పిల్లల్ని తమకు ఇవ్వాలని సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో అరుణ్ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మాధవి తన పిల్లలను తన వెంటే తీసుకెళ్ళుంది. కాగా మాధవితో కోనరావుపేట మండలానికి చెందిన కిషన్ అనే వ్యక్తి అక్రమ సంబందం పెట్టుకుంది.
తమకు అడ్డువస్తున్నాడని ఆరుష్ పై తన ప్రియుడితో కలిసి తరచూ దాడికి పాల్పడేది. ఆదివారం కూడా ఆరుష్ పై ఇద్దరు విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ఆరుష్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అపస్పారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తరువాత కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించినా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆరుష్ సోమవారం రాత్రి మృతి చెందాడు. మాధవితో అక్రమ సంబంధం పెట్టుకున్న కిషన్ తమను బెదిరింపులకు గురి చేసేవాడని మృతుడి నాయనమ్మ అనసూయ రోదిస్తూ తెలిపింది. పిల్లలు ఇద్దరినీ మా వద్ద నుండి తీసుకెళ్లి తన మనవడి ప్రాణం తీసిందని ఆరోపించింది. మాధవి, కిషన్ ల అక్రమ సంబందానికి అడ్డుగా ఉన్నారనే నెపంతోనే వారు దాడి చేస్తేనే మనవడు ఆరుష్ మరణించాడని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తమ మనవరాలినైనా తమకు అప్పగించాలని వేడుకుంది. మాధవి, కిషన్ నుండి తమకు ప్రాణహాని ఉందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరుష్ తాత లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాధవి, కిషన్ ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలిస్తున్నట్లు సమాచారం.






