- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజూరాబాద్ అభివృద్ధికి మరిన్ని నిధులు : కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పట్టణ సుందరీకరణకు మరిన్ని నిధులు కేటాయించేందుకు

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పట్టణ సుందరీకరణకు మరిన్ని నిధులు కేటాయించేందుకు కృషి చేస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హామీ ఇచ్చారు. గురువారం వొడితల ప్రణవ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి హుజురాబాద్ పట్టణానికి ఆనుకుని ఉన్న మోడల్ చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని కమిషనర్ సమ్మయ్య, ఇతర అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ... గొప్పగా పరిపాలించామని చెప్పుకున్న గత నాయకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో వారికే తెలియాలని ప్రశ్నించారు. చెరువు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను కూడా తొలగించే సమయం వారికి లేదా అని నిలదీశారు. గత పాలకులకు బురద చల్లే రాజకీయం తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని ఆయన విమర్శించారు.
15 కోట్ల నిధులు మంజూరు
వొడితల ప్రణవ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ నిధులలో భాగంగానే పిల్లల ఆహ్లాదం కోసం చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. మోడల్ చెరువుతో పాటు గంగోనికుంటను కూడా అభివృద్ధి చేస్తామని హుజురాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో హుజురాబాద్ కమిషనర్ సమ్మయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






