- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్ బస్టాండ్‌లో కోతుల బీభత్సం
హుజురాబాద్ బస్టాండ్‌లో కోతుల స్వైర విహారం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ బస్టాండ్‌లో కోతుల స్వైర విహారం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బస్టాండ్ ఆవరణ మొత్తాన్ని ఆక్రమించిన కోతులు.. గంటల తరబడి చేసిన బీభత్సం వల్ల ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి హుజురాబాద్ బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులకు ఈ కోతుల బెడద కారణంగా తీవ్ర అసౌకర్యం కలిగింది. కోతుల గుంపు బస్టాండ్ పైకప్పుతో పాటు ఆవరణలో అరగంటకు పైగా అల్లరి సృష్టించాయి.
చివరికి స్థానికులు ధైర్యం చేసి, కర్రలు, రాళ్లతో వాటిని బెదిరించి బస్టాండ్ ఆవరణ నుంచి తరిమి కొట్టారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హుజురాబాద్ బస్టాండ్‌తో పాటు పట్టణంలో కోతుల బెడద నిత్యకృత్యంగా మారుతోందని అధికారులు తక్షణమే స్పందించాలని ప్రయాణికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోతుల గుంపును అటవీ ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.






