మొక్కజొన్న కొనుగోళ్లపై ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం

by Ratna Kumari |

కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం పరిశీలించారు.

మొక్కజొన్న కొనుగోళ్లపై ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం
X

దిశ, కోరుట్ల రూరల్ : కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం పరిశీలించారు. గత నాలుగు వారాలుగా మొక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పంటను విక్రయించేందుకు వచ్చినప్పటికీ కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవ్వ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంజయ్, మార్క్‌ఫెడ్ డీఎంతో ఫోన్‌లో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వాన్ని ఒక్క‌టే కోరుతున్నా రైతుల గోస వినండి. పెట్టుబడి సాయం ఇవ్వలేరు, సకాలంలో యూరియా ఇవ్వలేరు, రైతు అప్పులు చేసి పంట పండిస్తే, దాన్ని కొనకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మీడియా మేనేజ్మెంట్ వదిలి గ్రౌండ్‌లోకి వచ్చి రైతుల సమస్యలు తెలుసుకోండి అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


మార్కెట్ యార్డ్‌లో నిల్వ ఉన్న మొక్కజొన్న వర్షాలకు తడిసిపోతుందనే ఆందోళనను రైతులు వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రారంభించకపోతే భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు తాత్కాలిక షెడ్‌లు, తార్పులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రైతు ధాన్యాన్ని పారదర్శకంగా, ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని రైతులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రైతుల సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈయన వెంట వ్యవసాయదికారిని నాగమణి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, నాయకులు చీటి వెంకటరావు, వీరబత్తిని దశరథం, నీలి శ్రీనివాస్ ఉన్నారు.

Next Story