నారాయణపూర్ నిర్వాసితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

by Ratna Kumari |

చొప్పదండి నియోజకవర్గ గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ ను పూర్తి చేసి,భూ నిర్వాసితులకు పరిహారం అందజేయడంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు

నారాయణపూర్ నిర్వాసితులకు అండగా ఉంటా :  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
X

దిశ, చొప్పదండి : చొప్పదండి నియోజకవర్గ గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ ను పూర్తి చేసి,భూ నిర్వాసితులకు పరిహారం అందజేయడంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు.నారాయణపూర్ రిజర్వాయర్ భూ సేకరణ చేసి, నిర్వాసితులకు పరిహారం అందజేయడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.ఇందులో భాగంగా నారాయణపూర్ భూ నిర్వాసితులకు పరిహారం అందజేయడానికి ఇప్పటికే ప్రభుత్వం నుండి రూ. 23.50 కోట్లను మంజూరీ చేయించారు.శుక్రవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని మరోసారి హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసిన నారాయణపూర్ రిజర్వాయర్ పరిహారం కోసం మరో రూ. 20 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పరిహారం మంజూరుకు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం, పాలకులు నారాయణపూర్ ముంపు బాధితులను పట్టించుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి,ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మరో రూ. 20 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలిపారు. కాగా పరిహారం మంజూరుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సత్యం కృతజ్ఞతలు తెలిపారు.

Next Story