రేపు మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

by Ratna Kumari |

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( Duddilla Sridhar babu) సోమవారం పర్యటించనున్నారు.

రేపు మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
X

దిశ, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( Duddilla Sridhar babu) సోమవారం పర్యటించనున్నారు. మంథని పట్టణంలోని శ్రీ పాద చౌక్ వద్ద ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా శ్రీపాద రావు విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవంతొ పాటు ఉచిత మ‌జ్జిగ‌ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు.అలాగే మంత్రి క్యాంప్ కార్యాలయంలో శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ప్రతిమ హాస్పిటల్ వాళ్ళు నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రి ప్రారంభోత్సవ చేయనున్నారు. స్కూల్ పిల్లలకు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. మంథని లక్ష్మీనారాయణ టెంపుల్ వద్ద 13 వార్డు సంబంధించి వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం, రావుల చెరువు కట్ట వద్ద శ్రీపాదరావు విగ్రహానికి పూల మాల వేయనున్నారు.

టూరిజం నుంచి రూ. 1 కోటి 98 లక్షలతో రావుల చెరువు కట్ట డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంథని మున్సిపాలిటీ లోని శ్రీపాద కాలనీలోని శ్రీపాద రావు విగ్రహాన్ని ఆవిష్కరణ చేయనున్నారు. మంథని మున్సిపాలిటీ పరిధిలో ప్రాథమిక వ్యవసాయం మార్కెట్ మంథని లోని వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేయనున్నారు.ముత్తారం మండలంలో కేశనపల్లి శ్రీపాద రావు విగ్రహం వద్ద పూలమాలవేసి వెంకటలక్ష్మి గార్డెన్ వద్ద శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ముత్తారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్ క్యాంపులకు సంబంధించి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేసి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. మచ్చుపేట బస్టాండ్ వద్ద శ్రీపాద చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం, బేగంపేట గ్రామంలో శ్రీపాద బస్టాండ్ ను ప్రారంభోత్సవం చేయనున్నారు. రామగిరి INTUC ఆఫీస్ వద్ద ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికతొ పాటు కమాన్ పూర్ మండలంలోని కమాన్ పూర్ లో శ్రీపాద కప్ ప్రారంభోత్సవం చేయనున్నారు. మలహర్ రావు మండలం తాడిచర్ల గ్రామంలో శ్రీపాద వర్ధంతి సందర్భంగా నిర్వహించిన శ్రీపాద కప్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేయనున్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధ‌ర్ బాబు.

Next Story