- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలు సహకరిస్తే ధర్మపురిని మరింత అభివృద్ధి చేస్తా.. మంత్రి కొప్పుల కీలక వ్యాఖ్యలు

దిశ, ధర్మపురి: ధర్మపురి ప్రజలు సహకరిస్తే ధర్మపురి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం ధర్మపురి పట్టణంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే రోలింగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను మంత్రి కొప్పుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మపురి యువకుల కోరిక మేరకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే ఇక్కడి యువకుల అభిలాష మేరకు ధర్మపురి గ్రౌండ్‌ను రూ.5 లక్షలతో అభివృద్ధి చేశామని అన్నారు. ఈ గ్రౌండ్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే ఏడాది టోర్నమెంట్ వరకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రౌండ్‌లో త్వరలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తెమ్మ, జెడ్పీటీసీలు అరుణ, రాజేందర్, నాయకులు ఇందారపు రామయ్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు.






