- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందూ దేవుళ్లను అవమానించినందుకు మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయాలి
హిందూ దేవుళ్లను అవమానించిందుకు మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయాలని బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం పేర్కొన్నారు.

దిశ, జగిత్యాల టౌన్ : దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు వెంటనే రాజీనామా చేయాలని, అలాగే మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాలని బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హిందూ దేవుళ్లను విమర్శించడం సిగ్గుచేటని, మంత్రి సురేఖ భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే హిందువులను హేళన చేసినప్పుడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఆ విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ నిధులు తెచ్చుకోలేకపోతున్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా లో మామునూరు వద్ద ఎయిర్‌పోర్ట్, స్మార్ట్ సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు ఎవరు కట్టబెట్టారో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. తన పదవి కాపాడుకోవడానికే ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపి నేతలు దేవుని పేరుతో ఓట్లు అడుగుతారని, మోడీ తో మీటింగ్ పెట్టి నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడించి పంపుతారని చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా, "రాహుల్ గాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఏ భాష మాట్లాడారో గుర్తుంచుకోవాలి" అని ప్రశ్నించారు. అలాగే మంత్రి సురేఖ క్షమాపణ చెప్పకపోతే ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే దేవాదాయ శాఖను రద్దు చేసి హిందూ దేవాలయాల నిర్వహణను మఠాధిపతులకు అప్పగించాలని, లేదా మసీదులు, చర్చిలను కూడా దేవాదాయ పరిధిలోకి తీసుకువచ్చి అసలైన సెక్యులరిజం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ, జిల్లా కోశాధికారి సుంకేటి దశరథరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు బైరి రాజేందర్ పాల్గొన్నారు.






