- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ భయంతో హైకోర్టును ఆశ్రయించారు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కాళేశ్వరం కమిషన్ నివేదిక పై కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టు తలుపు తట్టడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు

దిశ, ధర్మారం : కాళేశ్వరం కమిషన్ నివేదిక పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టు తలుపు తట్టడంపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు... విచారణ అంత పూర్తి అయిన తర్వాత, నివేదికను రద్దు చేయమని హైకోర్టు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు...ధర్మారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 23 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను, 121 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు... అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ... కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులు తప్పించుకునేందుకే హైకోర్టు వెళ్ళారని అన్నారు.
కమిషన్ విచారణకు హాజరై, నివేదిక వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు.చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టే నివేదిక పై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన దొంగతం బయటపడుతుందనే భయంతోనే హైకోర్టును ఆశ్రయించారని విమర్శించారు.ప్రాజెక్ట్ పేరుతో కమిషన్లను దండుకొని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది కెసీఆర్ అంటూ మండిపడ్డారు... ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ఆ నాయకులకు ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి,మార్కెట్ చైర్మన్ రుప్లా నాయక్,ఇంచార్జ్ తహసిల్దార్ ఉదయ్ కుమార్,ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






