- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి శంకుస్థాపనలు
ధర్మారం మండలంలో పర్యటించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి శంకుస్థాపనలు
- ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
దిశ,ధర్మారం: ధర్మారం మండలంలో పర్యటించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామయ్యపల్లె గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.20 లక్షల వ్యయంతో బుచ్చయ్యపల్లె గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఖిలావనపర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపం వద్ద సుమారు రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న వంటశాలకు భూమి పూజ చేశారు. అనంతరం రచ్చపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ మోర సుధాకర్‌తో పాటు సుమారు 40 మంది అనుచరులు,చామనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు వేల్పుల నాగరాజుతోపాటు సుమారు 20 మంది బీఆర్ఎస్ నాయకులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.






