మినీ గురుకుల పాఠశాలను ప‌దో తరగతి వరకు ఆఫ్ గ్రేట్ చేస్తా : మంత్రి అడ్లూరి

by Ratna Kumari |

మండ‌లంలోని గురుకుల పాఠ‌శాల‌లో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కు త‌ర‌గ‌తులు ప్రారంభిస్తామ‌ని తెలిపారు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్.

మినీ గురుకుల పాఠశాలను ప‌దో తరగతి వరకు ఆఫ్ గ్రేట్ చేస్తా :  మంత్రి అడ్లూరి
X

దిశ, ధర్మారం : ధ‌ర్మారం మండ‌లంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్, క‌లెక్ట‌ర్ కోయ శ్రీహ‌ర్ష ప‌ర్య‌టించారు. మంత్రి ల‌క్ష్మ‌ణ్ కుమార్ జ‌న్మ‌దిన వేడుక‌లు ధ‌ర్మారం మండ‌ల కేంద్రంలోని మినీ గురుకుల పాఠ‌శాల‌లో గిరిజ‌న విద్యార్థుల మ‌ధ్య జ‌రుపుకున్నారు. మిని గురుకుల పాఠ‌శాల‌లో అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దుల నిర్మాణానికి శంకుస్థాప‌న‌తో పాటు నూత‌న కిచెన్ షెడ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు కార్పొరేట్ స్థాయివిద్య‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం విద్య‌కు ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని తెలిపారు. ధ‌ర్మ‌పురికి రూ.200 కోట్ల‌తో మండ‌లంలోని గురుకుల పాఠ‌శాల‌లో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కు త‌ర‌గ‌తులు ప్రారంభిస్తామ‌ని తెలిపారు. విద్యార్థుల‌కు మంచి విద్య‌నందించాల‌ని, అడ్మిష‌న్స్ పెంచేవిధంగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కృషి చేయాల‌ని సూచించారు.


రాజ‌కీయంగా తొలిసారి అవ‌కాశం క‌ల్పించిన ధ‌ర్మారం మ‌డ‌లం పై త‌న‌కు ప్ర‌త్యేక గౌర‌వం ఉంటుంద‌ని తెలిపారు. తాను ఓడినా, గెలిచినా ధ‌ర్మారం మండ‌ల ప్ర‌జ‌లు త‌న వెన్నంటే ఉన్నార‌ని తెలిపారు. ఇప్ప‌టికే ఐటీఐ కళాశాల మంజూరు చేశామ‌ని.. జ‌డ్పీటీసీగా ఉన్న‌ప్పుడు ఇంట‌ర్ క‌ళాశాల తీసుకొచ్చిన‌ట్టు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాల కూడా మంజూరు కి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. వెల్పేర్ ప‌రిధిలో ఉన్న అన్ని గురుకులాల్లో డైట్ చార్జీలు, కాంట్రాక్ట్, నాన్ టీచింగ్ జీతాలు క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తి నెల మొద‌టివారంలో ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. మౌళిక వ‌స‌తులు లేని పాఠ‌శాల‌ల‌ను గుర్తించి వేస‌వి సెల‌వుల్లో మౌళిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ ని కోరారు. గురుకుల పాఠ‌శాల విద్యార్థుల‌కు సైకిళ్ల‌తో పాటు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన విద్యార్థుల‌కు ప‌రీక్ష ప్యాడ్ లు అంద‌జేశారు. మంత్రి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయ‌కులు జంగ మ‌హేంద‌ర్ యాద‌వ్ రూ.5వేల విలువైన నోటుబుక్స్, పెన్సిల్, పెన్నులు మంత్రి చేతుల మీదుగా విద్యార్థుల‌కు పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మండ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు తిరుప‌తి రెడ్డి, మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ రూప్లానాయ‌క్, వైస్ చైర్మ‌న్ లింగ‌య్య‌, మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు, స‌ర్పంచ్ లు పాల్గొన్నారు.

Next Story