కంటతడి పెట్టిన మిడ్ మానేరు నిర్వాసిత మహిళలు

by velandi.Saikiran |

బోయినపల్లి మండలం నీలోజి పల్లి గ్రామానికి చెందిన మిడ్ మానేరు నిర్వాసిత మహిళలు జలాశయంలో నీటిని చూసి పాటతో తమ

కంటతడి పెట్టిన మిడ్ మానేరు నిర్వాసిత మహిళలు
X

దిశ, బోయినపల్లి/వేములవాడ: బోయినపల్లి మండలం నీలోజి పల్లి గ్రామానికి చెందిన మిడ్ మానేరు నిర్వాసిత మహిళలు జలాశయంలో నీటిని చూసి పాటతో తమ కన్నీటి గాధను వ్యక్తపరిచారు. మిడ్ మానేరు ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో గ్రామానికి చెందిన నిర్వాసిత మహిళలు నీళ్ళను చూసేందుకు శనివారం సాయంత్రం డ్యాం కట్టపైకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తమ పాత ఊరు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ "మిడ్ మానేరు"లో మన ఊరు ఆగం అయిపోయిందంటూ పాటను పాడి కన్నీళ్లు పెట్టుకున్నారు. సామాజిక మాధ్యమాలో నిర్వాసిత మహిళల వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన పలువురు ఇతర నిర్వాసితులను కంటతడి పెట్టించింది.

Next Story