మిడ్ మానేరు కుడికాలువ నిర్వహణ పనులు చేపట్టాలి

by velandi.Saikiran |

మిడ్ మానేరు కుడి కాలువ నిర్వహణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ మంగళవారం ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్

మిడ్ మానేరు కుడికాలువ నిర్వహణ పనులు చేపట్టాలి
X

దిశ, సైదాపూర్: మిడ్ మానేరు కుడి కాలువ నిర్వహణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ మంగళవారం ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములుకు సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, మండల కార్యదర్శి గుండేటి వాసుదేవ్ వినతి పత్రం సమర్పించారు. మిడ్ మానేరు కుడి కాల్వ గన్పూర్ వరకు సీసీ లైనింగ్, జంగల్ కటింగ్ పనులు, అలాగే భారీ వర్షాలకు ప్రధాన కాలువకు వరద నీరు రాకుండా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న టేబుల్ రెండు పనులు పూర్తి చేసి గుడిషాల వరకు నీటి సరఫరా చేయాలన్నారు. దుద్దెనపల్లి వద్ద మైనర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 10L తూముకు నీరందడానికి ప్రధాన కాల్వపై గేట్లు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు సిపిఎం నేతలు.

Next Story