- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి : కొత్త ఎస్సై శ్రీధర్ రెడ్డి
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని మేడిపెల్లి నూతన ఎస్సై ఎం శ్రీధర్ రెడ్డి అన్నారు.

దిశ, మేడిపల్లి : శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని మేడిపెల్లి నూతన ఎస్సై ఎం శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం రోజున మేడిపెల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు మేడిపల్లిలో ఎస్సైగా పనిచేసిన శ్యామ్ రాజ్ వేరే ప్రదేశానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజల సహకారంతో శాంతిభద్రతలు కాపాడేందుకు కట్టుబడి ఉంటామని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు.
యువత మత్తు పదార్థాలకు, దురలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నవెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






