ఓదెల దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

by velandi.Saikiran |

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఓదెల దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
X

దిశ, ఓదెల: శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని సాంఘిక సంక్షేమ, గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ఓదెల దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు. కొత్త పాలకమండలి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ, లక్ష్మణ్ కుమార్ ల సహకారంతో రాబోయే రెండేళ్లలో ఓదెల దేవస్థానం లో భక్తులకు అన్ని రకాల వసతులు సౌకర్యాలను మెరుగుపరిచి అభివృద్ధి చేస్తామన్నారు.

ఇప్పటికే 18 మసాల కాలంలో నియోజకవర్గం లో 200 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి చేపట్టినట్టు తెలిపారు. ఒగ్గు కళాకారులకు ఆలయం ఆదాయంలో వాటా పెంచుతూ ప్రభుత్వం నుండి జారీ చేయించిన జీవోలను ఒగ్గు పూజారులు, కళాకారులకు అందించారు. ఎమ్మెల్సీ టీ భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ, అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించి సీఎం సహాయం కోరుతామని తెలిపారు. ఆలయ చైర్మన్ చీకట్ల ముండయ్య, లైబ్రరీ జిల్లా చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు, ప్రేమ్ సాగర్ రావు, చొప్పరి రాజయ్య కసిరెడ్డి మహేందర్ రెడ్డి సదయ్య రామకృష్ణ శ్రీనివాస్ ఆకుల మహేందర్ పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story