హుజూరాబాద్ లో భారీగా పీడీఎస్ బియ్యం ప‌ట్టివేత

by Ratna Kumari |

దిశ,​ హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ కి చెందిన రేషన్ బియ్యం అక్రమ రవాణా పై సివిల్ సప్లై ఎన్ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు.

హుజూరాబాద్ లో భారీగా పీడీఎస్ బియ్యం ప‌ట్టివేత
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ కి చెందిన రేషన్ బియ్యం అక్రమ రవాణా పై సివిల్ సప్లై ఎన్ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా బియ్యాన్ని పట్టుకున్నారు.​ విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఆదివారం ఉదయం హుజురాబాద్‌ పట్టణంలోని బోర్నపల్లి శివారులో ఉన్న వీరాంజనేయ రైస్ మిల్లుపై నిఘా ఉంచారు. రెండు ఆటోలలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్న సమయంలో అధికారులు వాటిని పట్టుకున్నారు. ఒక్కొక్క ఆటోలో మూడు క్వింటాళ్ల చొప్పున మొత్తం ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైస్ మిల్లులో నిర్వహించిన తనిఖీల్లో 320 క్వింటాళ్ల పీడీఎస్ లూస్ రైస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని హుజురాబాద్‌లోని రేషన్ స్టాక్ పాయింట్‌కు తరలించారు.​ ఈ సందర్భంగా సివిల్ సప్లై ఎన్ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ ప్రభాకర్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. చిగురు మామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రూ. 12 చొప్పున ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎడ్ల రమేష్ అనే దళారికి విక్రయిస్తున్నారని తెలిపారు. ​ఎడ్ల రమేష్ చెప్పడంతోనే ఈ రైస్ మిల్లుకు గత కొద్ది రోజులుగా పీడీఎస్ బియ్యాన్ని తీసుకొస్తున్నట్లు ఆటో యజమానులు పేర్కొన్నారని తెలిపారు. ఈ ఘటనపై సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించామని రైస్ మిల్లు యజమానిపై దళారులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయిస్తామని ఓఎస్‌డీ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై ఎన్ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు లక్ష్మారెడ్డి, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story