మానసిక స్థితి బాగాలేక వివాహిత ఆత్మహత్య.

by Bhanu |

మండలంలోని మల్యాల గ్రామపంచాయతీ లో గల జగ్గయ్య పల్లె గ్రామానికి చెందిన వివహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.

మానసిక స్థితి బాగాలేక వివాహిత ఆత్మహత్య.
X

దిశ కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని మల్యాల గ్రామపంచాయతీ లో గల జగ్గయ్య పల్లె గ్రామానికి చెందిన వివహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేష్ తెలిపిన పూర్తి వివరాల ప్రకారం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శారద గత కొన్ని సంవత్సరం నుండి మానసిక స్థితి బాగాలేక పోవడంతో భర్త ఉప్పుల అజయ్ కుమార్ అతను మానసిక వైద్యులకు ఎన్నో హాస్పిటల్ చూపించిన ఆరోగ్యం బాగుపడకపోవడంతో, మానసికంగా కృంగిపోయిన మృతురాలు సోమవారం తెల్లవారుజామున వారు నివసిస్తున్న ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు కు చున్నీతో ఉరి వేసుకుని చనిపోయినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని,అలాగే పోస్టుమార్టం నిమిత్తం పెద్దపెల్లి ప్రభుత్వ హాస్పిటల్ తరలించినట్లు ఏస్ ఐ తెలిపారు. మృతురాలకు కొడుకు ఉన్నట్లు తెలిపారు.




Next Story