ఉరి వేసుకుని వివాహిత మృతి..

by Bhanu |

మండలంలోని సంగెం గ్రామంలో వడ్డెర కాలనీకి చెందిన వివాహిత ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

ఉరి వేసుకుని వివాహిత మృతి..
X

దిశ, కోరుట్ల రూరల్: మండలంలోని సంగెం గ్రామంలో వడ్డెర కాలనీకి చెందిన వివాహిత ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సూర వెంకటి, రాజవ్వ(52) దంపతులు గురువారం రాత్రి గొడవ పెట్టుకున్నారు. మరుసటి రోజు వెంకటి రేషన్ బియ్యం తీసుకురావడానికి బయటకి వెళ్ళాడు. వెంకటి ఇంటికి వాళ్ల బంధువు వెళ్లి చూసే సరికి రాజవ్వ ఉరి వేసుకొని ఉండడాన్ని గమనించి, వెంకటికి తెలిపారు. దీంతో స్థానికులు కోరుట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అనుమానస్పద స్థితిలో మృతి చెందిన రాజవ్వ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story