- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంథని ఆర్డీఓ సరెండర్
మంథని ఆర్డీఓ గా పని చేసిన వి. హనుమానాయక్ ను చీఫ్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు సరెండర్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, మంథని : మంథని ఆర్డీఓ గా పని చేసిన వి. హనుమానాయక్ ను చీఫ్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు సరెండర్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ హెచ్ఏఐ, ఎల్ ఏ కు సంబంధించిన విషయంలో కోర్ట్ ఆదేశాలను పట్టించుకోకుండా విధుల పట్ల నిర్లక్ష్యం చేసినట్టుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సరెండర్ చేసినట్లు తెలుస్తుంది.
సింగరేణికి సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి కూడా ఆర్డీఓ పై ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన్ని సరెండర్ చేసినట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి ఆర్డీఓపై పలు విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరెండర్ చేయడంతో అధికారుల్లో అలజడి మొదలైంది. గతంలో మంథనిలో పనిచేసిన పంచాయతీ ఎంపీఓ ఆరిఫ్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామి, ఇప్పుడు ఆర్డీఓ హనుమా నాయక్ ను సరెండర్ చేయడంతో మంథని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి ఆర్డీఓగా పని చేస్తున్న బి.గంగయ్యకు మంథని ఇన్చార్జి ఆర్డీఓ బాధ్యతలు అప్పజెప్పినట్టు సమాచారం.
- Tags
- surrender






