మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుని ఫోరులో "పోరెడ్డి "

by Nallavelli.Anjaneyulu |

ఎల్లారెడ్డి పేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెళ్లి గ్రామానికి చెందిన పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సుముఖత వ్యక్తం చేశారు.

మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుని  ఫోరులో  పోరెడ్డి
X

దిశ, ఎల్లారెడ్డి పేట : ఎల్లారెడ్డి పేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెళ్లి గ్రామానికి చెందిన పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సుముఖత వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘానికి ఈ నెల 28 న ఎన్నికలు నిర్వహించాలని మండల కోర్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 15, 16 తేదీల్లో రెండు రోజులు నామినేషన్ వేయుటకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని రైతు చర్చ మండలి లో ఏర్పాటు చేశారు. నామినేషన్ ఫీజ్ 10 పదివేలు గా నిర్ణయించారు. నామినేషన్ వేసే అభ్యర్థికి ఇద్దరు ప్రతిపదించేవారు ఉండాలి. నామినేషన్ వేసే అభ్యర్థి తమ గ్రామ సంఘంలో గాని మండల సంఘం లో సభ్యులుగా ఉండాలని పోటీ చేసే అభ్యర్థికానీ ప్రతిపాదించే వారు మండల సంఘానికి ఎలాంటి బకాయిలు ఉండకూడదని నిర్ణయించారు. ఈ మండల ఎలక్షన్స్ సంబందించి పూర్తి బాధ్యత నిర్ణయాలు కోర్ కమిటీ కి ఉంటాయని, కోర్ కమిటీ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు.

Next Story