- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులకు యువకుడు బలి
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలో పప్పు ఆంజనేయులు (25 )ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులకు బలయ్యాడు.

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలో పప్పు ఆంజనేయులు (25 )ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులకు బలయ్యాడు. అప్పు తీర్చలేక, వాటి ఒత్తిడిని తట్టుకోలేక ఆదివారం రాత్రి గ్రామ శివారులోని గుట్టల సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన సెల్ ఫోన్ ద్వారా తన బాబాయ్, పిన్నిలకు తాను చనిపోతున్నానని, తన గురించి వెతకవద్దని సందేశం పంపాడు.
కుటుంబ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా, అప్పటికే యువకుడు మృతి చెంది ఉన్నాడు. గతంలో రెండు నెలల క్రితం కూడా ఆంజనేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొంది బయటపడ్డాడు. కరీంనగర్‌లో బీర్ల కంపెనీలో పనిచేసే ఆంజనేయులు, గత మూడు రోజులుగా పని మానేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గట్టుదుద్దెనపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.






