ప్రమాదవాశాత్తు కాలుజారి బావిలో పడి MBA విద్యార్థిని మృతి

by Bhanu |   (  Updated:2025-05-27 13:26:00  IST  )

మానకొండూరు మండలం కందులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

ప్రమాదవాశాత్తు కాలుజారి బావిలో పడి MBA విద్యార్థిని మృతి
X

దిశ, మానకొండూరు: మానకొండూరు మండలం కందులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందున్న బావిలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి అశ్విత (20) అనే ఎంబీఏ విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కందుల అశ్విత కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలానికి చెందినది. ఆమె ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు ఉపాధి హామీ పనులకు వెళ్లగా, అశ్విత, ఆమె తమ్ముడు రాజు ఇంట్లోనే ఉన్నారు. అశ్విత ఇంటి ముందున్న బావిలో నీళ్లు తోడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది.


తమ్ముడు రాజు గేదెలకు నీళ్లు పెట్టి కాళ్లు కడుక్కుందామని బావి వద్దకు వచ్చేసరికి అక్క బావిలో పడి ఉండటం చూసి కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చి బావిలోకి దిగి అశ్వినిని బయటికి తీయగా, అప్పటికే ఊపిరి ఆడక మృతి చెందింది. మృతురాలి తల్లి కందుల స్వప్న ఫిర్యాదు మేరకు మానకొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తన కూతురు మరణంపై ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని ఆమె పోలీసులకు తెలిపింది. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story