- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మెడికల్ బోర్డు నిర్వహించండి.. సింగరేణి కార్మికులను ఆదుకోండి'
సింగరేణి యాజమాన్యం తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, గోదావరిఖని : సింగరేణి యాజమాన్యం తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన సంవత్సరం కాలంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల వేలాది మంది కార్మికుల పిల్లలు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తపరిచారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి నెలలో రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కోల్ బెల్ట్ ఏరియాలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిచామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామిలు తక్షణమే స్పందించి మెడికల్ బోర్డు ఏర్పాటుకు చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ, ఐఎన్ టి యుసి సంఘాలకు అధికారాన్ని అనుభవించడం మాత్రమే తెలుసు, కానీ కార్మిక సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత సంవత్సరం నిర్వహించిన మెడికల్ బోర్డుకు హాజరైన కార్మికులను సర్ఫేస్ విభాగానికి బదిలీ చేసిన వారిని, భూగర్భగంలో చేసే పాత పనిని కొనసాగించాలని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వారికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రసాద్ తో చర్చిస్తామని, సిఎండి స్పందన ఆధారంగా భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. జాతీయ కార్మిక సంఘాలు, సాజక్ చంద్రబాబు నాయుడుతో కలిసి డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టారని కెసిఆర్ హయాములు తిరిగి కారుణ్య నియామకాల పేరిట వారసత్వ ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని రాజిరెడ్డి గుర్తు చేశారు. కార్మిక కుటుంబాలకు ఉద్యోగం కల్పించే విషయంలో కోర్టు తలుపు కూడా కడతామని డీజీఎంఎస్ అధికారులను కలుస్తామని ఆయన వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు అబ్బు శ్రీనివాసరెడ్డి,పాశం శ్రీనివాసరెడ్డి, భేతి చంద్రయ్య, పల్లె సురేందర్, వాసర్ల జోసెఫ్, జనగామ మల్లేష్, రొడ్డ సంపత్, మాసిడి సాయి చరణ్, వేణు, కే నాగేశ్వరరావు, అనిల్ రెడ్డి, కళాధర్ రెడ్డి పాల్గొన్నారు.






