- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
మండలంలోని పైడిమడుగు గ్రామానికి చెందిన తోకల నవీన్ (30) అనే ఎలక్ట్రీషియన్ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.

X
దిశ, కోరుట్ల రూరల్: మండలంలోని పైడిమడుగు గ్రామానికి చెందిన తోకల నవీన్ (30) అనే ఎలక్ట్రీషియన్ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం నవీన్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చి స్థానికంగా ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఓ ఇంట్లో కూలర్ రిపేర్ చేస్తూ విద్యుత్ షాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే అతను మృతి చెందాడు. మృతుడికి భార్య మౌనిక, రెండేళ్ల కూతురు ధనుశ్రీ ఉన్నారు.
Next Story






