- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెనాల్‌లో ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి
దిశ, చిగురుమామిడి : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంగనగర్ జిల్లాలో చోటు చేసకుంది.

X
దిశ, చిగురుమామిడి : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంగనగర్ జిల్లాలో చోటు చేసకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మేడి శెట్టి శంకర్ (35), ముల్కనూర్ గ్రామ శివారులో కాసర్ల మల్లయ్య అనే వ్యక్తి పొలం సమీపంలోని కెనాల్ వద్దకు ఈతకు వెళ్లాడు. దీంతో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడని మృతుని భార్య మేడి శెట్టి వరలక్ష్మి ఎస్‌ఐ దాస సుధాకర్ ఫిర్యాదు చేశారు. కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలు దేరిన వ్యక్తి గురువారం విగతజీవిగా కనిపిచడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నారు.
Next Story






